బడి పిల్లలతో హమాలీ పని.!
మోయలేక ఆయాస పడుతూ అస్వస్థత
మండల విద్యాశాఖ అధికారి నిర్లక్ష్యపు సమాధానం
నాగర్ కర్నూల్, విజయక్రాంతి: ప్రభుత్వపాఠశాలల్లోనే మెరుగైన విద్యను అందిస్తాయని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకే పంపాలని గొప్పగా ప్రగల్బాలు పలుకుతున్న అధికారులు విద్యార్థులతో హామాలీలుగా బరువైన పుస్తకాలను మోయిస్తూ బలవంతంగా వెట్టి చాకిరి చేయిస్తున్నారు. ఇదేంటని అడిగిన తల్లిదండ్రులకు మాత్రం అధికారులు నిర్లక్ష్యపు సమాధానమే ఇస్తున్నారు.
గురువారం నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ఎంఆర్సి భవనం నుండి కల్వకోల్ గ్రామంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలకు విద్యార్థుల పుస్తకాలను ఆటోలో తరలిస్తున్నారు. హమాలీలతో కాకుండా విద్యార్థులతో బరువైన పుస్తక సంచులను బలవంతంగా మోహించడంతో కొందరు విద్యార్థులు మోయలేక ఆయాస పడుతూ కడుపునొప్పితో అస్వస్థకు గురయ్యారు. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక మండల విద్యాధికారి చంద్రుడుని వివరణ కోరగా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు.






