12 July, 2026 | 7:08 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో అల్ఫోర్స్ సత్తా

10-06-2024 01:37 AM

కరీంనగర్ సిటీ, జూన్ 9 : జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యా ర్థులు ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో అ ద్భుత ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు ఎం హర్షిత్ 64వ ర్యాంకు, జీ శ్రీహాన్ 290, బీ భరద్వాజ్ 396, ఆర్ పునీత్ మనోహర్ 477, సుబోద్ చౌదరి 545, ఏ శివవరుణ్ 557, పీ రాహుల్ 571, దేవదత్త 751, విశా ల్ రెడ్డి 838, డీ రిశ్వంత్ కుమార్ 1029, పీ మనోహర్ 1229, నిహాల్ 1379, ఆదిత్యవర్ధన్‌రావు 1523, లహరి 1609, అరుణ్ కుమార్ 1658, బీ అభివన్ సిద్ధార్థరెడ్డి 1851, సత్య అమూల్య 1933 ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ ఖ్యాతిని మరింత పెంచారని తెలిపారు. వెయ్యి లోపు 9 మంది, 2 వేలలోపు 17 మంది, 5 వేలలోపు 32 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని తెలిపారు. అనంతరం విద్యార్థులను అభినందించారు.