30-12-2025 02:53:33 PM
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
పెద్దకొత్తపల్లి : వరి కొనుగోళ్ల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ దావత్ సంతోష్ అన్నారు. మంగళవారం పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామంలోని మహిళా సంఘాల వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతుల నమోదు, తూకం ప్రక్రియ వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని స్వయంగా పరిశీలించి, నాణ్యత, తేమ శాతం వంటి అంశాలపై అరా తీశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని తూకంలో పూర్తి పారదర్శకత పాటించాలి.
ఎక్కడా అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన వరి ధాన్యానికి సంబంధించిన చెల్లింపులు 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పూర్తిగా అందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు.కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ, కూర్చునే సదుపాయాలు వంటి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. వారి వెంట డీపీఎం కృష్ణయ్య, ఏపీఎం సంతోష్, కమిటీ సభ్యులు అరుణమ్మ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.