30-12-2025 02:50:26 PM
బెల్లంపల్లి(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు మంగళవారం గ్రామ సర్పంచ్ చిలుముల శ్రీనివాస్ భూమి పూజ చేశారు. తొలుత సర్పంచ్ శ్రీనివాస్, హిందూ ఉత్సవ సమితి బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కట్టేవాడ నాగేష్, ఉపసర్పంచ్ గజెల్లి రాజ్ కుమార్, సోమేశ్వర దేవాలయ అధ్యక్షులు నాగేష్ గౌడ్ శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.