అసైన్డ్ పట్టా రైతులను ఇబ్బంది పెట్టొద్దు
26-06-2024 12:05 AM
- ఎమ్మెల్యే హరీష్‌బాబు
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): అసైన్డ్ పట్టా భూమి ఉన్న రైతులను ఫారెస్టు అధికారులు ఇబ్బందులకు గురి చేయవద్దని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు డిమాండ్ చేశారు. మంగళవారం కాగజ్‌నగర్ మండలంలోని అంకుశాపూర్ శివారులో సర్వే నంబర్ 165లో 40 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న రైతులను కలిసి, సమస్యను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు 75 మంది రైతులకు 20 ఏండ్ల కిందటే ప్రభుత్వం పట్టాలిచ్చిందని, ఇప్పుడు ఫారెస్టు అధికారులు ప్లాంటేషన్ చేస్తామనడం తగదన్నారు. ఆయనవెంట బీజేపీ నాయకులు కొంగ సత్యనారాయణ, నియోజకవర్గ కన్వీనర్ వీరభద్ర ఉన్నారు.






