4 May, 2026 | 2:11 AM

కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇవ్వాలి

26-06-2024 12:05 AM
  • ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్

ఆదిలాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదింటి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగా రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులు దళారులను నమ్మవద్దని సూచించారు.  జైనథ్ మండల కేంద్రంలో సైతం చెక్కులను పంపిణీ చేశారు.