27 June, 2026 | 8:20 PM

పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దు

14-06-2024 12:45 AM

కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ

ఆదిలాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసులను అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేయవద్దని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణ కోరారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామ పంచాయతీ పరిధిలోని సిరికొండ గ్రామంలో పోడు రైతులను అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని తెలుసుకుని గురువారం ఆమె వెళ్లి పరిశీలించారు. పోడు భూముల్లో మొక్కలు నాటడానికి జేసీబీతో తవుతున్న గుంతలను ఆపాలని అటవీ అధికారులకు సూచించారు. ఆదివాసులపై అటవీ అధికారుల ప్రతాపమేమిటని మండిపడ్డారు. ఆదివాసీలు 15 సంవత్సరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నారని, ఇప్పుడు మొక్కలు నాటితే వారి బతుకులు ఏమవుతాయని ప్రశ్నించారు.

మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో ఎట్టకేలకు జేసీబీని తిరిగి పంపించారు. అనం తరం సుగుణ మాట్లాడుతూ.. ఇక నుంచి ఆదివాసులను కొత్త భూమిని కొట్టనీయబోమని, పాత భూమిలోకి అటవీ అధికారు లను రానివ్వబోమని చెప్పారు. ఆదివాసుల మీద అటవీ అధికారుల పెత్తనాన్ని సహించేది లేదన్నారు. ఏ సమస్య ఉన్నా గ్రామ ప్రజల సమక్షంలో కమిటీలతో మాట్లాడి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పోడు చేసుకుని సాగు చేసుకుంటున్న రైతులకు తరలోనే కాంగ్రెస్ ప్రభుతం పట్టాలు అందజేస్తుందని తెలిపారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ర్ట నాయకుడు శ్రీకాంత్‌రెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ సెడ్మాకి ఆనంద్‌రావు, నాయకులు కోరెడ్డి కిషన్, సుధాకర్‌గౌడ్, మల్లన్న, బ్యాపురావు, కిషన్ తదితరులు ఉన్నారు.