27 June, 2026 | 7:03 PM

Breaking News

అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డే   •  

హైదరాబాద్‌కు ఒలింపస్

14-06-2024 12:47 AM
  1. ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న ఒలింపస్ కార్పొరేషన్ 
  2. ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): ప్రముఖ అంతర్జాతీయ మెడి కల్ టెక్నాలజీ కంపెనీ ఒలింపస్ కార్పొరేషన్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ కంపెనీ తమ ఆర్‌అండ్‌డీ ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఓడీసీ)ను హైదరా బాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఒప్పుకున్నట్లు గురువారం ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు పలు సంస్థలను కలుస్తున్నారు.

అందులో భాగంగా న్యూయార్క్‌లో ఒలింపస్ కార్పొరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నవీద్‌తో వర్చువల్‌గా మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటి రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సయ్యద్ నవీద్ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకున్నట్లు శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఒలింపస్ కార్పొషన్ ఏర్పాటు చేయడం అనేది హైదరాబాద్‌కే కాకుండా తెలంగాణకు కూడా ఒక మైలురాయి అని మంత్రి పేర్కొన్నారు. ఒలింపస్ కంపెనీకి పూర్తి సహాయ, సహకారాలను అందజేస్తామని వివరించారు. ఈ కంపెనీ రావడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అలాగే, వైద్య సాంకేతికతలో ప్రపంచ ఆవిష్కరణలకు ఒలింపస్ సెంటర్ దోహదపడుతుందని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

గల్ప్ కార్మికుల సంక్షేమ కోసం ప్రత్యేక బోర్డు

గల్ఫ్‌లో పనిచేస్తున్న కార్మికుల కోసం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. గురువారం వాషింగ్ టన్‌లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్(జీటీఏ) నిర్వహించిన ఒక కార్యక్ర మంలో ఆయన మాట్లాడుతూ,  తమ  ప్రభుత్వం తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వచ్చిన కార్మికులపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఇందులో భాగంగానే గల్ఫ్‌బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటన చేసినట్లు ఆయన గుర్తు చేశారు.

కేరళ ప్రభుత్వం కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 20 సంవత్సరాల క్రితమే ఈ బోర్డును ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో  ఉందన్న మంత్రి శ్రీధర్‌బాబు  తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడి పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం ఎంతో అనుకూలంగా ఉందని, ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ పరిశ్రమల ఏర్పాటుకు అనేక మౌళిక సదుపాయాలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.  ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు  వచ్చేవారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు.