18 July, 2026 | 7:17 PM

Breaking News

మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి   •   ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యా బోధన జరగాలి   •   నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •  

శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడొద్దు

27-10-2024 12:47 AM

రాచకొండ సీపీ సుధీర్‌బాబు

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 26: శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడొద్దని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అన్నారు. శనివారం ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, రికార్డులను పరిశీలించడంతో పాటు పలు విభాగాల పనితీరును పరిశీలించారు.

సీసీ టీవీల నిర్వహణపై ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలని, అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, సిబ్బంది ఎప్పుడూ అప్రమ త్తంగా ఉండాలని తెలిపారు. మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.