29 July, 2026 | 12:52 AM

జీపీ నిధుల నుంచి కరెంట్ బిల్లులు తీసుకోవద్దు

29-07-2026 12:00 AM

ఎంపీడీవోకు వినతి పత్రం అందజేసిన సర్పంచులు

నాగిరెడ్డిపేట్,జులై 28 (విజయ క్రాంతి): మండలంలో ఉన్న సిసి చార్జీల గురించి తెలియజేస్తూ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీడీవో గంగాధర్కు వినతి పత్రాన్ని అందజేశారు.దాదాపు మూడు సంవత్సరాల నుండి ఉన్న గ్రామ పంచాయతీల కరెంటు బిల్లులు లక్షల్లో బకాయిలు ఉన్నాయని ఇప్పుడు మేము వచ్చిన వెంటనే కరెంటు బిల్లులు కట్టుమని చెప్తున్నారు. మా గ్రామ పంచాయతీలో ఉన్న రూపాయలకు ఈ కరెంటు బిల్లులు కడితే మా గ్రామపంచాయతీలో డబ్బులు ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.

గ్రామాలలో ఎటువంటి డెవలప్మెంట్ చేయడానికి డబ్బులు ఉండవని కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వహృదయంతో కరెంట్ బిల్లులు,సిసి చార్జీలు మాఫీ చేయాలని కోరుతూ ఎంపీడీవో గంగాధర్కు నాగిరెడ్డిపేట మండల సర్పంచులు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మురళి గౌడ్,సర్పంచులు యాద గౌడ్,వెంకట్ గౌడ్, వంశీకృష్ణ గౌడ్,సురేష్, శ్రీనివాస్ గౌడ్,పుప్పాల సాయిలు,బుర్రకాయల రోజా,వర్షిని,బెస్త భాగ్య,నార్ల గంగమని,జ్యోతి, సత్యబోయిన పద్మ, పార్వతి,తదితరులు పాల్గొన్నారు.