calender_icon.png 19 January, 2026 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ

19-01-2026 09:56:29 PM

కరపత్రాలను ఆవిష్కరించిన కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ,(విజయక్రాంతి): తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా వివిధ ఉద్యోగాలకు అందిస్తున్న ఉచిత శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. హనుమకొండ ఎస్సీ స్టడీ సర్కిల్  ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఎస్సి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు కావలసిన రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నట్లు, ఈ సదావకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ,దివ్యాంగ నిరుద్యోగులకు రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల తో పాటు, ఆర్.ఆర్.బి, బ్యాంకింగ్ , స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వంటి  పోటీ పరీక్షలకు ఐదు నెలల ఉచిత శిక్షణతో పాటు మెటీరియల్ కూడ ఇవ్వబడుతుంది అన్నారు .ఈ శిక్షణకు దరఖాస్తులు చేసుకొనుటకు ఈ నెల 30 తేదీ వరకు వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలని, వార్షిక ఆదాయం మూడు లక్షల వరకు ఉన్నటువంటి వారు ఆన్లైన్లో http://tsstudycircle.co.in/ దరఖాస్తులు చేసుకోవాలి.

దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి 8న ఆదివారము హనుమకొండలో పరీక్ష నిర్వహించి, ఉత్తీర్ణతలైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ సదా అవకాశాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ డిప్యూటీ డైరెక్టర్ బి.నిర్మల, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ కె. జగన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.