29 April, 2026 | 3:22 AM

ఎవరో ఏదో చెప్పారని చెడు మార్గంలో వెళ్లొద్దు

29-04-2026 01:04 AM
  1. ఉమెన్ అండ్ చైల్ సేఫ్టీ టీనేజ్ గర్భధారణ ఫై అవగాహన
  2.  మునిసిపల్ చైర్ పర్సన్ దేవర సమత వెంకటరెడ్డి

చేవెళ్ళ ఏప్రిల్ 28(విజయక్రాంతి): చేవెళ్ళ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాలు మంగళవారం చేవెళ్ళ మునిసిపల్ పరిధిలోని ఊరెళ్ళ-మొండివాగు1,2, కేసారం, మల్లారెడ్డి గూడ, కందవాడ, మల్కాపూర్, దామరగిద్ద, రామన్నగూడ, ఇబ్రహీంపల్లి, మొదలైన అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక ఉమెన్ అండ్ చైల్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ఆయా సంబంధించిన కౌన్సిలర్ లు, అంగన్వాడీ, మునిసిపల్ సిబ్బంది, పాల్గొన్నారు. చేవెళ్ళ మునిసిపల్ కార్యాలయం పక్కనున్న అంగన్వాడీ కేంద్రంలో మునిసిపల్ చైర్ పర్సన్ దేవర సమత వెంకటరెడ్డి ఆధ్వర్యంలో చైల్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ... టీనేజ్ లో గర్భధారణ ఎలోప్ మెంట్ పై అమ్మాయిలకు అవగాహనా ఉండాలని చెప్పారు. ముక్యంగా అమ్మాయిలు ఎవరో ఏదో చెప్పారని చెడు మార్గంలో వెల్లి బంగారు జీవితాన్ని ఆగం చేసుకోవద్దని కోరారు.

సోషల్ మీడియా ఫోన్ ల వాడకం తగ్గించాలన్నారు. పోషకాహారం పండ్లు ఫలాలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ ఎస్ .వెంకటేశం, కౌన్సిలర్లు శైలజ ఆగిరెడ్డి, మద్దెల శ్రీను, ఎస్ ఐ శిరీష, ఐసిడిఎస్ సూపర్వైజర్ రేవతి, అంగన్వాడీ టీచర్స్ ఉమారాని, ప్రవీణ, ఆశా వర్కర్లు, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.