12-12-2025 12:00:00 AM
ఎమ్మెల్యేకు వినతి
రాజేంద్ర నగర్ డిసెంబర్ 11, (విజయక్రాంతి): జిహెచ్‌ఎంసి విస్తరణలో భాగంగా శివరాంపల్లి గ్రామాన్ని సులేమాన్ నగర్ డివిజన్లో కలపడం సరైనది కాదని, జిహెచ్‌ఎంసి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని శివరాంపల్లి వాసులు కోరుతున్నారు. ఈమెరకు గురువారం గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ పెండ్యాల చంద్రమోహన్, ఎస్ ప్రతాపరెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ ఆర్ యాదిరెడ్డి, మాజీ కౌన్సిలర్, సీనియర్ నాయకులు పడమటి శ్రీధర్ రెడ్డి, ఎం ప్రభాకర్ రెడ్డి, బండారు శంకర్ లు మైలార్ దేవ్ పల్లిలో ని ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ ను కలిసి ప్రతిపత్రాన్ని సమర్పించారు.
సులేమాన్ నగర్ డివిజన్లో కలపడం వల్ల శివరాంపల్లి, బీకర్ సెక్షన్ కాలనీ, ప్రశాంత్ కాలనీ, కృష్ణా నగర్, ఫ్రెండ్స్ కాలనీ ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతాలను రాజేంద్రనగర్ లేదా కాటేదాన్ డివిజన్లో కలపాలని కోరారు. ఈ మార్పు చేర్పుల కోసం అవసరమైతే అన్ని కాలనీలో వాసులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికైనా సిద్ధం గా ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో సన్నీ, రాహుల్ రెడ్డి, ఎస్ రాజశేఖర్ రెడ్డి, ఏ. సురేష్, డి. రమేష్, శ్రీధర్ రెడ్డి, నాగబాబు, ఇంద్రారెడ్డి, పిట్టల మధుసూదన్, సదల వెంకట్ రెడ్డి, రొక్క మహేందర్ రెడ్డి, సదాల గోవర్ధన్ రెడ్డి, మనోహర్, నరోత్తం రెడ్డి, గద్దెల విజయ్ గాంధీ, బుట్ట ఆనంద్, మోహన్ రావు, సాంబ జగదీష్, పి. ప్రకాష్ రెడ్డిలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.