20-12-2025 12:53:10 AM
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల డిసెంబర్ 19:కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఇతర పార్టీల వారు దాడులకు పాల్పడితే తాను చూస్తూ ఊరుకోనని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎలాంటి ప్రతీకా దాడులకు పాల్పడకూడదని,అలా చేస్తే వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. సమాజంలో శాంతి భద్రతలు ప్రధానమని వ్యాఖ్యానించారు.మూడవ విడత పంచాయితీ ఎన్నికలు ముగిసిన తర్వాత గురువారం జడ్చర్ల మండలంలోని నస్రుల్లాబాద్ తాండ లో బీఆర్‌ఎస్- కాంగ్రెస్ వర్గీయుల మధ్య,అలాగే గొల్లపల్లి గ్రామంలో కాంగ్రెస్-బీజేపీ వర్గీయుల మధ్య దాడులు, గొడవలు జరిగిన నేపథ్యంలో శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ వారు రౌడీయిజం చేస్తున్నారని కేటీఆర్ అంటున్నారని, నస్రుల్లాబాద్ తాండలో కాంగ్రెష్ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపొందితే బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారు గొడ్డలితో దాడి చేసారని రౌడీయిజం ఎవరు చేస్తున్నారో కేటీఆర్ ఇప్పుడు చెప్పాలని కోరారు. సం గ్రామంలో అందరూ సంతోషంగా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని దారులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.