20-12-2025 12:51:37 AM
ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్
అలంపూర్, డిసెంబర్ 19: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు సమగ్ర అభివృద్ధి చెందుతాయని ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం శాంతినగర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో.. ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి మంచి మెజారిటీతో గెలుపొందిన సర్పంచ్ అనసూయమ్మ రాజేష్ ఉప సర్పంచ్ దర్శ సంపత్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని... అందులో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను పెద్ద ఎత్తున గెలిపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు జయ చంద్రారెడ్డి, మండల అధ్యక్షులు రుక్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సాసనుల్ సర్పంచుకు సన్మానం
ఎర్రవల్లి మండలం శాసనల్ గ్రామ సర్పంచుగా గెలుపొందిన రేణుక బీసన్న ను ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పూలమాలలు శాలువా కప్పి సన్మానించారు గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అదేవిధంగా బట్లదిన్నె గ్రామ సర్పంచ్ దేవమ్మను పూలమాలలు శాలువా కప్పి సన్మానించి ... రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం దిశగా పయనిస్తుందని తద్వారా గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని తెలిపారు.