బీపీ, షుగర్‌ను నిర్లక్ష్యం చేయొద్దు
ఆదిభట్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి
ఆదిభట్ల, మార్చి 29 (విజయక్రాంతి): 35 ఏళ్లు దాటిన వారంతా ఆరు నెలలకొకసారి పూర్తి వైద్య పరీక్షలు చేయించుకో వాల ని, బీపీ, షుగర్ లాంటి పరీక్షలను నిర్లక్ష్యం చేయవద్దని ఆదిభట్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి సూచించారు. ఆదివారం నియోజకవర్గ పరిధి శ్యామ్ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా హె ల్త్ క్యాంప్ ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ నిత్య వ్యాయామాన్ని అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిందన్నారు.
ఈ హెల్త్ క్యాంప్‌లో ప్రముఖ వైద్యులు రంగరాజ్, శ్రీనివాస్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా నిరంజన్ రెడ్డి ఆసుపత్రి వైద్యులు, సి బ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్, మాజీ వైస్ చైర్మన్ కోరె కల మ్మ, కౌన్సిలర్ లావణ్య పాండురంగారెడ్డి, పాక్స్ చైర్మన్ జమ్మ శ్రీశైలం, మాజీ వార్డ్ స భ్యులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




