30 March, 2026 | 3:28 AM

సిద్ధాంతమే బీజేపీ స్ట్రెంత్... క్యాడర్ బేస్డ్ పార్టీ బీజేపీ

30-03-2026 01:52 AM

నగర మేయర్ కొలగని శ్రీనివాస్

కొట్టపల్లి, మార్చి29(విజయక్రాంతి):భారతీయ జనతా పార్టీ ఎంచుకున్న సిద్ధాంతం, భావాజాలం   తో నే  పార్టీ ప్రపంచంలోనే  అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీగా అవతరించిందని , క్యాడర్ బేస్డ్ పార్టీ బిజెపి అని నగర మేయర్  కొలగని శ్రీనివాస్  అన్నారు. పండిత్ దీన్ దయాల్  ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ శిక్షణలో భాగంగా  కరీంనగర్ మండలం , నార్త్ జోన్ శిక్షణ శిబిర ముగింపు (సమారోప్) కార్యక్రమంలో మేయర్ కోలగని శ్రీనివాస్ పాల్గొని పై వ్యాఖ్యలు చేశారు .

సమరోప్ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నేతలు సంగ నరేష్ , అయ్యo గారి ప్రభాకర్రెడ్డి  , రాణి రుద్రమ, ఈనుకొండ నాగేశ్వర్ రెడ్డి లు మాట్లాడుతూఇద్దరు ఎంపీలతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ నేడు  దేశాన్ని ఏలుతుందని , వరుసగా 3 సార్లు కేంద్రం లో అధికారం లో  వచ్చిందని, దేశంలోనే తిరు శక్తిగా  అవతరించిందన్నారు. బీజేపీ  పార్టీ సిద్ధాంతం ఎంతో గొప్పదన్నారు.

. అందుకే వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. మోడీ ప్రభుత్వం, బిజెపి  పట్ల  ప్రజలంతా ఎంతో విశ్వాసంతో ఉన్నారని  తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకు వెళ్లడానికి కృషి చేయాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యలపై  నిరంతరం పోరాటం చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

బీజేపీ జిల్లా ప్రధనకార్యదర్శి లు తల్లాపల్లి శ్రీనివాస్ గౌడ్ మాడ వెంకట్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి మీడియా సెల్ జిల్లా కన్వీనర్ కటుకం లోకేష్ మండల అధ్యక్షులు సంతోష్ పదం శివరాజ్  కార్పొరేటర్ లు సోమిడి వెనుప్రసద్ బండారి వేణు సాదినేని లావణ్య మునిoధర్ సాయిల్ల శ్రావణి మహేందర్  తదితరులు పాల్గొన్నారు.