19 June, 2026 | 3:32 AM

రైతుల జీవితాలతో ఆటలొద్దు

19-06-2026 02:17 AM
  1. పాత విధానంలోనే ధాన్యం సేకరించాలి
  2. సన్నాల సాగుపై ఆంక్షలు దారుణం
  3. మాజీ మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి) : తెలంగాణలో వ్యవసాయాన్ని, రైతుల జీవితాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ విధానా లు ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఇప్పటికే బోనస్‌కు కోత పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా ఈపూ క్యాబినెట్ పేరుతో ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తే యడం రైతులను దారుణంగా మోసం చేయడమేనని మండిపడ్డారు. క్యాబినెట్ నిర్ణయాలపై గురువారం ఒక ప్రకటనలో హరీ శ్‌రావు ధ్వజమెత్తారు.

రోజుకో వింత నిర్ణ యం, చెత్త విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బతుకును చిత్తు చేస్తోందని, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిస్ట్రక్టివ్ క్రియేటివిటీ పేరుతో రైతుల జీవితాలతో ఆడుకుంటున్నదని మండిపడ్డారు. కేం ద్రం నిర్దేశించిన కోటాకు లోబడి మాత్రమే ధాన్యం సేకరిస్తామని చెప్పడం చూస్తే కొనుగోళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోవడమే నని విమర్శించారు.

తమ చేతగానితనాన్ని రాష్ట్ర క్యాబినెట్ మీడియా సాక్షిగా ఒప్పుకున్నదని ఎద్దేవా చేశారు. పంటలను కొనకపోతే, రైతులు ఏం చేయాలి? ఇంట్లో దాచుకోవాలా?, రైతుల బతుకులతో ఆడుకునే పరి స్థితి ఈ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్ర శ్నించారు. బోనస్ రావాలంటే ఏడు రకాల సన్నాలే సాగు చేయాలని చెప్పడం అంటే సాగుపై ఆంక్షలు విధించడమేనని మండిపడ్డారు.

కేసీఆర్ రైతును రాజుగా చేస్తే, రేవం త్‌రెడ్డి దివాలా తీయించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ, రైతుభరో సా, రైతుబీమా, పంట బోనస్, కొనుగోళ్లు, నీటి సరఫరా, కరెంట్ సరఫరా ఇలా అన్నింటిలో కోతలు పెడుతున్నారని వివరించారు. ప్రాజెక్టుల్లో తెలంగాణ వాటా నీటిని ఆంధ్రప్రదేశ్‌కు వదిలేసి, పంటలు చూసుకుని వేయండని చెప్పడంపై నిలదీశారు.