28 June, 2026 | 1:48 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

రాముడితో రాజకీయం చేయొద్దు..

21-04-2026 12:00 AM

సిద్దిపేట , ఏప్రిల్ 20 (విజయక్రాంతి): రామకోటితో రాజకీయం చేస్తే సహించేది లేదని సిద్దిపేట రామకోటి బృందం నాయకులు మధుసూదన్ అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకోటి భక్త బృందం సభ్యులు మాట్లాడారు. సిద్దిపేట పట్టణానికి చెందిన గుండు రవితేజ అనే వ్యక్తి రామకోటితో రేవంత్ రెడ్డి పేరు రాసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపించారు.

రామకోటిలో రాజకీయ నాయకుల పేరు రాసినందుకు గతంలోనే మార్కండేయ దేవాలయంలో అతడిని మందలించామని,  అయినప్పటికీ సామాజిక మాధ్యమాల ద్వారా  వీడియోలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా గుండు రవితేజ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.  మీడియా సమావేశంలో రామకోటి భక్త బృందం సభ్యులు శ్రీనివాసచారి, నాగరాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.