21 April, 2026 | 1:59 AM

షార్ట్ సర్క్యూట్‌తో వరికోత మిషన్ దగ్ధం

21-04-2026 12:00 AM

చర్ల, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): చర్ల మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన రాంపండు కోత మిషన్ బోధనెల్లిలో ఉదయం ఎనిమిది గంటల సమయంలో వరి కోత కోస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైంది. బోధనెల్లి శివారులో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది.

వరి కోతలు కోస్తున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో వరి కోత మిషన్ మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. సత్యనారాయ ణపురానికి చెందిన రాంపండు అనే వ్యక్తికి చెందిన ఈ మిషన్ పొలంలో పనిచేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో యంత్రం పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంతో రాంపండు అనే వ్యక్తికి భారీగా నష్టం వాటిల్లింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే కిందకు దూకడంతో ప్రాణాపాయం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.