పశువులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
పాల్వంచ సీఐ సతీష్
బూర్గంపాడు,ఏప్రిల్ 20 (విజయక్రాంతి): ఆవులను, పశువులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని పాల్వంచ సీఐ సతీష్ అన్నారు.సోమవారం మండల పరిధిలోని మోరంపల్లి బంజర్ గ్రామంలోని పశువుల సంత ఆవరణలో సర్పంచ్ బొర్రా సుభద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
పశువులు తరలించే క్రమంలో సంబంధిత పత్రాలు ఉండాలని, రైతులకు సంబంధించిన గేదెలను తరలించేటప్పుడు సంబంధిత వాహనంలో ఎక్కువ గేదెలను తరలించకుండా ట్రాలీ లాంటి ఆటోలో ఒకటి లేదా రెండు మినీ వ్యాన్ లాంటి వాటిలో కనీసం నాలుగు మాత్రమే తరలించే విధంగా ఉండాలని అవి కూడా అధికారుల అనుమతితో తరలించాలని కొనుగోలు చేసుకున్న వారు తమకి పాడికి సంబంధించిన గేదలను తరలించాలని అన్నారు.
గర్భిణితో ఉన్న గేదెలు, లేదా అప్పుడే పుట్టిన గేదెలు దూడ సహా తీసుకువెళ్లే క్రమంలో తప్పకుండా సంబంధిత వెటర్నటీ డాక్టర్ను సంప్రదించి వారి అనుమతులతో తరలించాలని సూచించారు. సంత ప్రాంతం నుండి పశువులను కటిక శాలలకు తరలించవద్దని అట్టి వారి పై నిఘా ఏర్పాటు చేస్తున్నామని తప్పకుండా అక్రమంగా తరలిస్తూ వ్యాపారాలు చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు కొన్ని కఠిన చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు.
వారపు సంత ప్రశాంతంగా అధికారుల సూచనల మేరకు సంత నిర్వహించే నిర్వాహకులు నడుపుకోవాలని ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు అదనపు ఎస్‌ఐ నాగభిక్షం, పంచాయతీ కార్యదర్శి భవాని, వెటర్నరీ డాక్టర్ రాజేందర్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు రెండా పుల్లారెడ్డి,యారం నాగిరెడ్డి, గ్రామస్తులు సంత నిర్వాహకులు తదితరులు ఉన్నారు.






