3 April, 2026 | 8:49 PM

అర్హతకు మించిన వైద్యం చేయరాదు

08-02-2025 12:00 AM

రాష్ట్ర పారామెడిక్ వైద్యుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఉక్కుల అశోక్

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 7 (విజయ క్రాంతి): అర్హతకు మించిన వైద్యం చేయరాదని తెలంగాణ రాష్ట్ర పారామెడిక్ వైద్యుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఉక్కుల అశోక్ అన్నారు. శుక్రవారం తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్ వైద్యుల ఐక్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్టంలో ఉన్న అన్ని జిల్లాల మండలాలలో ఉన్నటువంటి అధ్యక్షులు నకిలీ ఆర్‌ఎంపి, పిఎంపి వైద్యులను గుర్తించి, ఆర్‌ఎంపి, పిఎంపి సంఘ నాయకులకు లేదా ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వాలనీ, అర్హతకు మించి వైద్యం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అధికారులను కోరారు.

ఆర్‌ఎంపి, పిఎంపి లు ప్రథమ చికిత్స మాత్రమే చేసుకొని జీవనోపాధి గడపాలని అన్నారు. అనంతరం నగరంలో ఎం.ఎల్.సి కోదండరాంని కలిసి రాష్ట్రంలోనీ అర్.ఎం.పి, పి.ఎం.పి సమస్యలను వివరించి సమస్యలు పరిశ్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలబ్రహ్మచారి, వెంకట్ రెడి, మోహన్ బాస్కర్, రవిందర్, బాలక్రిష్ణ, మహెందర్ తదితరులు పాల్గొన్నారు.