3 April, 2026 | 9:16 PM

కలెక్టరేట్ లో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

03-04-2026 07:27 PM

హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ కలెక్టరేట్లో సాయిధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ఎన్.రవి అధ్యక్షత వహించగా, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు బుట్టి శ్యామ్ యాదవ్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ తొలి అమరుడని,దొడ్డి కొమురయ్య సాయుధ పోరాట పటిమను ఈ సందర్భంగా కొనియాడారు.

దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆసనాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం అన్నారు. వరంగల్ జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొము రయ్య జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డిఆర్ ఓ విజయలక్ష్మి లతో కలిసి కొమురయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమంలో దొడ్డి కొమురయ్య కీలకపాత్ర పోషించారని ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు.