కోనరావుపేటలో 108 అంబులెన్స్‌పై ఆకస్మిక తనిఖీ
– సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని సూచనలు
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలో 108 అంబులెన్స్ సేవలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించబడింది.రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమ నాగేందర్ ఆదేశాల మేరకు EME అరుణ్ కుమార్ ఈ తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లో విధులు నిర్వహిస్తున్న EMT ప్రవీణ్, పైలట్ నవీన్‌లను మెడికల్ ఇండెంట్, అవసరమైన పరికరాలు (ఎక్విప్‌మెంట్స్), రికార్డుల నిర్వహణపై ప్రశ్నించారు.సేవల నాణ్యతను పరిశీలిస్తూ పలు సూచనలు చేశారు.
ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ నెల నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని, అత్యవసర పరిస్థితుల్లో ‘గోల్డెన్ అవర్స్’ను సద్వినియోగం చేసుకుని క్షతగాత్రులను వేగంగా ఆసుపత్రికి తరలించాలని సూచించారు.అంబులెన్స్ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు సమయానికి సేవలు అందించాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.




