3 April, 2026 | 9:12 PM

సీఎం సొంత జిల్లా నుంచే యాదవుల తిరుగుబాటు ప్రారంభం

03-04-2026 07:21 PM

* యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలి

* నల్లమల్ల అడవిలో గొర్రెల కాపరులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

* యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్

అచ్చంపేట: సీఎం రేవంత్ రెడ్డి సొంత  నియోజకవర్గం నుంచే యాదవుల తిరుగుబాటు యుద్ధం ప్రారంభమైందాన్ని యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ అన్నారు. శుక్రవారం అచ్చంపేటలోని టీఎన్జీవో భవనంలో యాదవ జేఏసీ చైతన్య సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ...నల్లమల్ల ప్రాంతం నుంచే యాదవుల యుద్దం ప్రారంభమైందన్నారు. నల్లమల్ల అడివిని గొర్రెల మేత కోసం గొర్రెల కాపరులకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రములో యాదవులపై దాడులు జరుగుతున్నారు.

రాష్ట్ర మంత్రివర్గంలో యాదవులకు చోటు కల్పించాలన్నారు. అలాగే నామినేటెడ్ పదవులల్లో యాదవులకు సముచిత స్థానం కల్పించాలన్నారు. రూ.5 వేల కోట్లతో యాదవ కార్పొరేషన్ ను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. కోకాపేట్ లో ఏర్పాటు చేస్తున్న యాదవ భవనాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో యాదవులకు ఇస్తానన్న హామీలను అమలు చేయకుండా రెండున్నర ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు.