6 June, 2026 | 10:32 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

మీడియా ముందు ఆ విషయాలు మాట్లాడొద్దు!

09-09-2024 12:00 AM

మాలీవుడ్‌లో జస్టీస్ హేమ కమిటీ రిపోర్ట్ ప్రకంపనలు రేపుతూనే ఉంది. రోజురోజుకూ ఏదో ఒక ఇష్యూ బయటపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నటి రోహిణి రియాక్ట్ అయ్యారు. ఆదివారం జరిగిన నడిగర్ సంఘం మీటింగ్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా హేమ కమిటీ రిపోర్టను ఉద్దేశించి మాట్లాడారు. లైంగిక వేధింపుల గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడవద్దని హితవు పలికారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని సూచించారు.

కాగా పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఇప్పుడు ఏకరువు పెడుతున్నారు. దీనికి ముగింపు ఎప్పుడో అనే ప్రశ్న తలెత్తుతోంది. నటి సిమ్రాన్ కూడా తానూ వేధింపుల బాధితురాలినేనని పేర్కొన్నారు. సిమ్రాన్ ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా రాణించారు. వివాహానంతరం నటనకు దూరం అయినా, తాజాగా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.