calender_icon.png 20 June, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది తెలంగాణ నేపథ్యం మూవీ

09-09-2024 12:00:00 AM

హీరో తేజస్ కంచర్ల

హుషారు వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తేజస్ కంచర్ల. తేజస్ చేస్తోన్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్. లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ బ్యాన్ప వివేక్ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాల భాను ఈ సినిమాను నిర్మించారు. వినాయక చవితి స్పెషల్గా చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ క్రమంలో హీరో తేజస కంచర్ల మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..

  1. హుషారు తరువాత చాలా కథలు విన్నాను. ఏదైనా కొత్తగా ఉండే కథలను చేయాలని అనుకున్నా. అందుకే చాలా రొటీన్ కథలను విన్న తరువాత ఈ పాయింట్ నాకు చాలా నచ్చింది. వివేక్ ఈ పాయింట్ను చెప్పినప్పుడు ఎగ్టైట్ అయ్యాను. ఆ తరువాత ఇద్దరం కలిసి కథను రాసుకున్నాం. అలా ఈ మూవీ స్క్రిప్ట్ను పూర్తి చేశాం.  కథ అయితే రెడీ అయింది.. స్క్రిప్ట్ బాగా వచ్చింది. చాలా మంది నిర్మాతల వద్దకు వెళ్లాం. కథను వినిపించాం. అందరూ బాగానే ఉందని అన్నారు. కానీ నా మీద అంత బడ్జెట్ పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్లు కూడా రైటే. అందుకే చివరకు ఈ కథను మా నాన్న విన్నారు. ఆయనకు నచ్చడంతో ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు.
  2. తెలంగాణ బ్యాక్ డ్రాప్లో ఈ కథ ఉంటుంది. యాస అందరికీ అర్థమయ్యే లా ఉంటుంది. అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యేలానే ఉంటుంది. నేను పుట్టి పెరిగింది హైద్రాబాద్లోనే కాబట్టి యాసతో పెద్ద ప్రాబ్లం ఏమీ రాలేదు.  టీజర్, ట్రైలర్ చూస్తే కథ ఏంటన్నది మీకు అర్థం అవుతుంది. ప్రస్తుతం ఉన్న తరుణంలో కథ ఏంటి? సినిమా ఎలా ఉంటుంది? అనేది ఆడియెన్స్ కు ముందే హింట్ ఇస్తే బెటర్. అందుకే మా టీజర్, ట్రైలర్ ద్వారా ఈ సినిమా ఎలా ఉండబోతోందనేది ముందే కాస్త చెప్పేశాం.
  3. ట్రైలర్ చూస్తే సినిమా అంతా హీరోయిన్ చుట్టే తిరుగుతుందని అనిపి స్తుంది. కానీ సినిమాలోకి వచ్చాక వేరేలా ఉంటుంది. ఉరుకు పటేలా అనే టైటిల్ ఏంటి? ఎందుకు ఉరుకడం? అనేది జస్టిఫై చేసేలా ఉంటుంది. ఆద్యంతం నవ్వించేలానే ఈ సినిమా ఉంటుంది.