13 April, 2026 | 4:53 PM

బ్యాటరీ కంపెనీ ఉంటే ఓటు వేయం

13-05-2024 12:28 AM

మహబూబ్‌నగర్ ఎదిర 4వ వార్డు వాసులు  

మహబూబ్‌నగర్, మే 12 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు ప్రజలు తాము ఓటు వేయబోమని తీర్మానించారు. ఐటీ కంపెనీ పెడతామని 400 ఎకరాల భూమిని సేకరించి.. తరువాత అమరరాజా బ్యాటరీ కంపెనీని తీసుకువచ్చి తమకు బతుకులేకుండా చేశారని అగ్రహం వ్యక్తం చేశారు. తాము ఓటు వేయాలంటే ఇక్కడి నుంచి కంపెనీ తీసివేయాలని ఇదివరకే ప్రకటించారు. కాగా, కంపెనీ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎదిర ప్రజలు తాము ఓటు వేయబోమని ప్రకటిస్తుండటంతో మహబూబ్‌నగర్‌లో చర్చనీయాంశంగా మారింది. అధికారులు వచ్చి బ్యాటరీ కంపెనీని ఇక్కడి నుంచి తొలగిస్తామని చెప్తేనే తాము ఓటు వేస్తామని మాజీ కౌన్సిలర్ శివశంకర్ తెలియజేశారు.