ఘనంగా ఆదిశంకరాచార్య జయంతి
13-05-2024 12:29 AM
ఉత్సవాల్లో పాల్గొన్న హంపి పీఠాధిపతి
ఆదిలాబాద్, మే 12 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఆదిశంకరా చార్య జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో హంపీ విరూపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతి పాల్గొన్నారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి ఆధ్వర్యంలో వైదిక పురోహిత్ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మహాలింగార్చన, చండీయాగం నిర్వహిస్తున్నారు. ముందుగా ఆదిగురువు శంకరాచార్య ప్రతిమకు ప్రత్యేక అభిషేకం, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని హంపీ పీఠాధిపతి విద్యారణ్యభారతి ఆశీస్సులను స్వీకరించారు.




