calender_icon.png 6 December, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగం కావొద్దు..

06-12-2025 12:43:49 AM

  1. మళ్లా మన ప్రభుత్వమే వస్తది

బీఆర్‌ఎస్ పాలనలోనే స్వయం పాలిక కేంద్రాలుగా గ్రామాలు: మాజీ సీఎం కేసీఆర్

ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులకు అభినందనలు

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): గత పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ర్టంలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెంది, స్వయం పాలిత కేంద్రాలుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయని మాజీ సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. దళిత, గిరిజన, బహుజన, మహిళా వర్గాలకు, కుల వృత్తులకు నాటి బీఆర్‌ఎస్ ప్రభు త్వం అందించిన ప్రోత్సాహం, గ్రామీణాభివృద్ధికి అమలుచేసిన పథకాలు, పల్లె ప్రగ తికి అందించిన ఆర్థిక సహకారం, తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవ స్థ బలోపేతానికి తోడ్పాటును అందించాయని తెలిపారు.

తాను దార్శనికతతో చేపట్టిన పాలనా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. తాను దత్తత తీసుకున్న  గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లు శుక్రవారం కేసీఆర్‌ను ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. గ్రామస్తుల సమష్టి మద్దతుతో ఎన్నికైన సర్పంచులను శాలువాలతో సత్కరించిన కేసీఆర్.. వారికి మిఠాయిలు పంచారు. తన వద్దకు వచ్చిన గ్రామస్థులను, గుర్తుపట్టి పేరు పేరునా పలకరించి, వారి యోగ క్షేమాలను అడిగి 

 తెలుసుకున్నారు. గ్రామాల్లో వాతావరణం, మౌలిక వసతుల అందుబాటు, పండుతున్న పంటల పరిస్థితి గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా తెలంగాణలో బీఆర్‌ఎస్ పాలనలో గొప్పగా వర్ధిల్లిన గ్రామాల పరిస్థితిని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రకాలుగా దిగజారిన పరిస్థితిని, గ్రామస్థులు కేసీఆర్ దృష్టికి తెచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. నాడు విద్యుత్, సాగునీరు సహా వ్యవసాయాభివృద్ధికి అందించిన సహకారం, పల్లె ప్రగతికి క్రమం తప్పకుండా విడుదల చేసిన నిధులు, అన్ని వర్గాల కోసం ప్రత్యేకంగా అమలుచేసిన పథకాలు, అందించిన ఆర్థికసాయం గురించి గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా సమావేశంలో ఉన్న ఒక గ్రామస్థుడు మాట్లాడుతూ... ‘సార్ తమరి హ యాం మా పల్లెలకు సువర్ణ యుగం. ఇప్పుడేముంది సార్ గోస మిగిలింది. అన్ని కులాలు అరిగోస పడుతున్నయి. ఏదైనా పోగొట్టుకున్నంకనే అర్థమైతది సార్. మీరు వున్నప్పుడు తెల్వలె మీ విలువ.. ఇప్పుడు అర్థమైతాంది. మల్ల మీరొస్తే తప్ప తెలంగాణ పల్లెలకు మునుపటి కళ రాదు.. మల్ల మీరే రావాలే... వస్తరు.. కాంగ్రెస్ ప్రభుత్వంల ఇగ మాగ్గూడ రోండెండ్లకే సరిపోయింది సార్’ అని అన్నారు.

అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘మనకు అన్ని కాలాలు అనుకూ లంగా వుండయి. కొన్ని కొన్ని సమయాలు కష్టాలు వస్తయి, వాటికి వెరవకూడదు. మ ల్లా మన ప్రభుత్వమే వస్తది. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచిరోజులు వస్తయి. అప్ప డిదాకా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అధైర్య పడొద్దు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో స్వయంశక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవా లె’ అని గ్రామస్థులకు వివరించారు.

‘ఇప్పుడు నూతనంగా ఎన్నికైతున్న సర్పంచులు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రచించు కోవాలి. గంగదేవిపల్లి లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకొని, ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేసుకొని, మన పని మనం చేసుకుంటూ, మన పల్లె అభివృద్ధికి పాటుప డాలి. ఎవరో ఏదో చేస్తారని ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దు’ అని కేసీఆర్ తెలిపారు.

ఈ సందర్భంగా వారికి జాతీయ, అంతర్జాతీయంగా పల్లెల ప్రగతికి గొప్ప వ్యక్తులు చేసిన కృషి గురించి కేసీఆర్ వివరించారు. బంగ్లాదేశ్‌కు చెందిన సామాజిక ఆర్థికవేత్త, స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు స్ఫూర్తిదాత, ప్రొఫెసర్ యూనిస్‌తో పాటు మన దేశానికే చెందిన అన్నా హజారే లాంటి దార్శనికుల కృషిని వివరించారు. ఎర్రవెల్లి సర్పంచి, కవిత దంపతులు, ఉప సర్పంచ్ ఎడ్మ సబితాకరుణాకర్ సహా వార్డు మెంబ ర్లు, నర్సన్నపేట సర్పంచ్ బాల నర్సయ్య సహా ఇరుగ్రామాల ప్రముఖులను కేసీఆర్ సత్కరించారు.