మాకు న్యాయం చేయండి
గురుకుల టీచర్, ఏఈఈ అభ్యర్థుల ఆందోళన
సీఎం నివాసం వద్ద గురుకుల అభ్యర్థుల ధర్నా
గాంధీభవన్ ఆవరణలో ఏఈఈ అభ్యర్థుల నిరసన
మోకాళ్లపై నిలిచి నిరసన వ్యక్తం
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): గురుకుల టీచర్, ఏఈఈ అభ్యర్థులు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం వేర్వేరుగా ఆందోళన నిర్వహించారు. ఉద్యోగానికి సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన పూర్త యి నెలలు గడుస్తున్నా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసం వద్ద గురుకుల అభ్యర్థులు నిరసన చేశారు.
అసిస్టెంట్ ఎగ్జక్యూటివ్ ఇంజనీర్ అభ్యర్థులు గాంధీవన్ ఆవరణలో ఆం దోళన చేపట్టారు. సీఎం ఇంటి వద్ద గురుకుల టీచర్ అభ్యర్థులు మోకాళ్లపై నిలబడి తమ సమస్యలను పరిష్కరిం చాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను గురుకుల టీచర్ అభ్యర్థులు అడ్డుకున్నారు. తమకు న్యా యం చేయాలంటూ చేతులెత్తి దండం పెడుతూ వేడుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చచెప్పి పంపించారు. అలాగే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద నర్సిం గ్ స్టాఫ్ కూడా జీతాలు రావడం లేదని నిరసన వ్యక్తం చేయగా వారికి పోలీసులు నచ్చజెప్పి పంపించారు.
గాంధీభవన్ ఆవరణలో..
గాంధీభవన్ దగ్గర కూడా ఏఈఈ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్ పరిశీలన జరిగినా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని అభ్యర్థులు వాపోయారు. మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే గాంధీభవన్ దగ్గర మోకాళ్ల మీద నిరసన వ్యక్తం చేశారు. మార్చిలో 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను కమిషన్ సెలక్ట్ చేసిందని, డాక్యుమెంటేషన్ జరిగి మూడు నెలలు గడిచినా అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం లేదన్నారు. వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఆందోళన పడొద్దు: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
గురుకులాలు, ఏఈఈ అభ్యర్థులు ఆందోళన చెందవద్దు. ప్రభుత్వం న్యాయం చేస్తుంది. కొందరు నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నా దగ్గరికి వస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఒక్కొక్కటి సరి చేస్తున్నాం. ఒక్క ఇబ్బంది కలగకుండా గ్రూప్ పరీక్షను ప్రభుత్వం నిర్వహించింది. నీట్‌పై హైదరాబాద్ వేదికగా నిరసన కార్యక్రమం నిర్వహించబోతున్నాం. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయడం సరికాదు. ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శలు చేయాలి. కానీ తప్పుడు ప్రచారాం చేయవద్దు.






