కేంద్రంపై ఒత్తిడి తెస్తాం
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): విభజన చట్టంలోని హామీలను రాష్ట్రానికి వచ్చేలా పార్లమెంట్‌లో కొట్లాడుతామని నాగర్‌క ర్నూల్ ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేటలో కోచ్ ఫ్యాకర్టీ, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీ యహోదాపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. రూ.2 వేల కోట్లతో ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.
గాంధీభవన్‌లో మంగళవారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. వీటి ద్వారా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. టీచర్లు లేరని గత ప్రభుత్వం పాఠశాలలను మూసివేసిందని, ఇప్పుడు సర్కారు స్కూళ్లను తెరిపిస్తుందన్నారు. ఒక ఉపాధ్యాయుడు ఉన్న స్కూళ్లను కూడా కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. బడిబాట కార్యక్రమంలో ప్రజాప్రతిని ధులు అందరూ పాల్గొనాలని రేవంత్‌రెడ్డి సూచించారని తెలిపారు.






