సినిమాల మంత్రినే పట్టించుకోరా?
హైడ్రా పేరు వింటేనే అక్రమార్కులు హడలెత్తిపోతున్నారు. నీటి వనరుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన పెద్ద పెద్ద భవంతులను, ఫంక్షన్ హాళ్ల భరతం పడుతున్నారు హైడ్రా అధికారులు. ఎంత పెద్ద నాయకుడైనా, సిని ప్రముఖులైనా వదిలిపెట్టడం లేదు. ఇటీవల సినీ నటు డు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ను కూలగొట్టడంతో ఈ చర్చ జనం లో హాట్ టాపిక్‌గా మారింది. నాగార్జున కట్టిన ఎన్ కన్వెన్షన్ బఫర్ జోన్‌లో ఉన్నదని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమ టిరెడ్డి వెంకట్‌రెడ్డినే హైడ్రాకు ఫిర్యాదు చేయడం, అది సోషల్ మీడియాలో చక్క ర్లు కొట్టడంతో ప్రజల్లో ఆసక్తికరమైన చ ర్చ సాగుతోంది.
కోమటిరెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సినిమా రంగానికి చెందిన పెద్దలందరు వచ్చి మ ర్యాదపూర్వకంగా కలిశారట. నాగార్జున మాత్రం కోమటిరెడ్డిని పట్టించుకోలేదట. సినిమా శాఖకు తాను మంత్రిగా ఉంటే కనీస మర్యాద ఉండదా? అని కాస్త బా ధ, కొంచెం కోపం వచ్చిందట. సమయం కోసం చూసిన మంత్రి.. హైడ్రాను అవకాశంగా మలుచుకున్నారని రాజకీయ వర్గా ల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముం దు ముందు ఇంకా ఎన్ని చిత్ర విచిత్రాలు జరుగుతాయో చూడాలి.






