సల్కం చెరువులో ఉన్న ఓవైసీ అక్రమ నిర్మాణాలు కూల్చాలి
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం హైడ్రాను తెచ్చిందన్నారు. పాతబస్తీలోని అక్రమ నిర్మాణాలపై చర్చలు తీసుకోవాలని ఏలేటి తెలిపారు. సల్కం చెరువులో ఉన్న ఓవైసీ అక్రమ నిర్మాణాలు కూల్చాలని డిమాండ్ చేశారు. పాతబస్తీలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కబ్జా చేశారని బీజేపీఎల్పీ వెల్లడించారు.
ఆక్రమణకు గురైన చెరువులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. 13 వేల అక్రమ నిర్మాణాలను ఎప్పటిలోపు కూల్చివేస్తారో చెప్పాలని, హైదరాబాద్ లోని 30 చెరువులు 85 శాతం కబ్జా అయ్యాన్నారు. హైడ్రాకు హక్కులు, చట్టబద్ధత కల్పించాలని, అక్రమ నిర్మాణాలను కాపాడాలని ఓవైసీ కోరడం సిగ్గుచేటు అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి దుయ్యబటారు.






