calender_icon.png 8 June, 2025 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తలనొప్పి వస్తుందా?

11-05-2025 12:00:00 AM

* వేసవిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తలనొప్పి సమస్యను తగ్గించవచ్చు. ఈ సమయంలో ఇలా జరగడం సర్వసాధారణం కాబట్టి భయపడాల్సిన పనిలేదు. కానీ.. దాహం వేసినా వేయకున్నా ఎప్పటికప్పుడు తగినంత నీరు తాగుతూ ఉండాలి. అప్పుడే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండగలరు. శరీరంలో నీటి కొరతను నివారించడానికి ప్రతిరోజూ కనీసం మూడు లీటర్ల నీరు తాగాలి. 

* శరీర వేడిని తగ్గించడంలో నువ్వుల నూనె చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నువ్వుల నూనెతో తలపై సున్నితంగా మసాజ్ చేసుకుంటే శరీరం ప్రశాంతంగా మారుతుంది. దీనివల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

* ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్ల తలనొప్పి సమస్య పెరుగుతుంది. అందుకే బయటికి వెళ్లినప్పుడు సూర్యకిరణాలు నేరుగా మీ తలని తాకకుండా చూసుకోవాలి. అప్పుడే తలనొప్పి రాకుండా నిరోధించవచ్చు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు తీసుకెళ్లడం లేదా తలపై స్కార్ఫ్ లేదా టోఫీ ధరించడం మంచిది. ఈ జాగ్రత్తలు తలనొప్పిని నివారించడంలో సహాయపడతాయి.

* తులసి, అల్లంతో తయారుచేసిన టీ కూడా వేడి వల్ల కలిగే తలనొప్పిని నివారించడంలో సహాయపడుతుంది. ఈ టీ తాగడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఎందుకంటే ఇది సహజమైనది. శరీరానికి ఎటువంటి హాని కలిగించకుండా విశ్రాంతినిస్తుంది. వేడి వల్ల కలిగే సమస్యలకు ఇది సహజమైన ఇంటి నివారణగా బాగా పనిచేస్తుంది.