15 June, 2026 | 11:10 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా?

06-02-2026 12:51 AM

కరీంనగర్‌కు రూ.1,400 కోట్లు విడుదల చేశానన్న సీఎం రేవంత్ నిరూపించాలి

బండి సంజయ్ సవాల్

కరీంనగర్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): కరీంనగర్‌కు రూ.1,400 కోట్లు విడుదల చేశానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పడం పెద్ద జోక్ అని, దీనిపై శ్వేత ప త్రం విడుదల చేసే దమ్ముందా అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల పాలనలో కరీంనగర్‌కు నయాపైసా ఇవ్వలేద ని అన్నారు. నన్ను కోసినా నయాపైసా లేద ని చెప్పిన రేవంత్‌రెడ్డి ఎన్నికలొస్తున్నాయని అబద్ధాలాడుతున్నరని పేర్కొన్నారు. సీఎంకు రోషం, పౌరుషం చచ్చిపోయిందని అన్నారు. కేసీఆర్ పంపే మూటలను ఢిల్లీకి పంపి సీఎం సీటును కాపాడుకుంటున్నారన్నారు.