15 June, 2026 | 10:02 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో వీహెచ్ హనుమంతరావు సందడి

06-02-2026 12:51 AM

నాగర్‌కర్నూల్, జనవరి 5 (విజయక్రాంతి):నాగర్కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వీ హెచ్ హనుమంతరావు సందడి చేశా రు. గురువారం జిల్లా కేంద్రంలోని 8, 2, 13, 17 వార్డుల్లో పోటీలో ఉన్న అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బ తుకమ్మ ఆడి పాడి, పిల్లలతో ఖోఖో ఆడుతూ సందడి చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు తులం బంగారం, రూ.2,500 పింఛన్ తప్ప మిగతా హామీలన్నీ అమలు చేశామన్నారు. ఉ చిత విద్యుత్, వడ్డీలేని రుణాలపై కేసీఆర్ కు ప్రశ్నించే అర్హత లేదన్నారు.

మహారాష్ట్రలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ రైతులను మోసం చేశారని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆలోచనలతో సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని అన్నారు. బీసీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టు బడి ఉందని, అసెంబ్లీలో తీర్మానం పంపినా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉందన్నారు. రుణమాఫీ రైతులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడలేదని చెప్పారు. తెలంగాణలో స్పోరట్స్ సిటీ, ఫ్యూచర్ సిటీలు నిర్మిస్తున్నామని, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.