calender_icon.png 9 January, 2026 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా

08-01-2026 05:24:25 PM

బిఆర్ఎస్ నాయకులు దూడల అశోక్ 

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్ నాయకులకు పట్టణ అభివృద్ధి గుర్తుకు వచ్చిందా అని బి ఆర్ ఎస్ నాయకుడు దూడల అశోక్ ప్రశ్నించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లు గంధం శ్రీనివాస్, చిలువేరు వెంకన్నతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీర శాం నాయక్ ఏ హోదాలో మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొట్టారని ప్రశ్నించారు.

ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన పట్టణంలో ఇలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు చేయాలంటే టెండర్ కావాల్సి ఉంటుందని తెలిపారు. ఇలాంటి ఉత్తర్వులు లేకుండానే కొబ్బరికాయలు  కొట్టుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ఆడుతున్న నాటకాలను ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

ఎన్నికలవేళ హడావిడి చేసేందుకే కొత్త నాటకానికి తెర లేపారని అన్నారు. అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండానే కొబ్బరికాయలు కొట్టడం వెనకాల ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి నాటకాలు అనుకోవాలని హితవు పలికారు. పట్టణంలో అభివృద్ధి పనులను ప్రారంభించడంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు హైమద్, నాయకులు లక్ష్మి, సంగీత,నిసార్, సాజిద్, అన్సార్ ,రవి ,తాజ్, సాయి, హైమద్, కాసిం తదితరులు పాల్గొన్నారు.