08-01-2026 05:27:19 PM
ఆర్థిక సహాయం చేసిన మాజీ సర్పంచ్ తెప్పల బ్రదర్స్
కాటారం,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామంలో గురువారం హోటల్ హోటల్ పూర్తిగా కాలి బూడిదయింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. గంగారంలో కుమ్మరి దుర్గయ్య మమత కుటుంబం హోటల్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. వారికి చెందిన హోటల్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోయింది. అయ్యప్ప మాలధారణలో ఉన్న దుర్గయ్య భిక్షకు వెళ్ళగా, ఆయన భార్య మమత పనిమీద బయటకు వెళ్ళారు.
అనుకోకుండా మంటలు చెదరేది హోటల్ తో పాటు సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. మోటార్ సైకిల్ తో పాటు సుమారు లక్ష రూపాయల వరకు నగదు సైతం కాలిపోయినట్లు బాధితులు బోరున విలపిస్తూ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న గంగారం మాజీ సర్పంచ్ తెప్పల దేవేందర్ రెడ్డి, తెప్పల ప్రభాకర్ రెడ్డి లు సంఘటన స్థలాన్ని సందర్శించారు. బాధితులకు ఆర్థిక సహాయం, నిత్యవసర సరుకులను అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. పదివేల రూపాయలు నగదు తో పాటు 25 కేజీల బియ్యం తదితర వంట సామాగ్రిని అందజేశారు. బాధితులకు భరోసా కల్పించారు. మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడి ప్రభుత్వం నుండి నష్టపరిహారం వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.