ఇప్పుడు గుర్తొచ్చారా?
- బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో దివ్యాంగులకు .. ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా?
- హరీశ్‌రావు మాట్లాడినవన్నీ అబద్ధాలే..
- మా వెయ్యి రోజుల పాలనపై చర్చకు సిద్ధం : మంత్రి అడ్లూరి
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): ‘పదేళ్ల పాటు మేమే రాజులం.. మేమే మంత్రులం.. మాకు ఎదురులేదన్నట్లు’గా వ్యవహరించిన బీఆర్‌ఎస్ నేతలకు అధికారం పోయిన తర్వాత దివ్యాంగులు గు ర్తుకొచ్చారా? అని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమర్ ప్రశ్నించా రు. 2014, 2018, 2023 ఎన్నికల మ్యానిఫెస్టోల్లో ది వ్యాంగులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తి చేయకుండా.. ఇప్పుడు మాట్లాడ టం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
ఆదివా రం సీఎల్పీ కార్యాలయంలో మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ దివ్యాంగుల స మావేశంలో హరీశ్‌రావు మాట్లాడినవన్నీ అబద్దాలనేనని ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఏకవచనంతో సంబోధిస్తూ విమర్శలు చేయడం సరికాదన్నారు. దివ్యాంగుల సమస్యలపై మాట్లాడాలంటే ఆధారాల తో మాట్లాడాలని, రాజకీయ ప్రయోజనాల కోసం వారిని ఉపయో గించుకోవడం సరికాదని మంత్రి హితవు పలికారు. తమ వెయ్యి రోజుల పాలనపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నామని, కేసీఆర్ అసెం బ్లీకి వస్తే అక్కడనే చర్చిద్దామని సవాల్ విసిరారు.
‘మీ పదేళ్ల పాలన, మా ప్రభుత్వ పాలన’పై ప్రజల సమక్షంలో చర్చ జరగాలన్నా రు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వా త దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యే క ప్రాధాన్యం ఇచ్చిందని మంత్రి తెలిపారు. రూ.50 కోట్లతో వాహనాలు, బ్యాటరీ వెహికిల్స్‌తో పాటు వివిధ సహాయ పరికరాలను దివ్యాంగులకు అందించామన్నారు. వచ్చే ఏడాది మరో రూ.50 కోట్లతో సహాయ వా హనాలు, అవసరమైన పరికరాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంద న్నారు.
దివ్యాంగులు స్వయం ఆధారితంగా జీవించేలా ప్రభుత్వం నిరంతరం కృషి చే స్తుందని తెలిపారు. దివ్యాంగలకు రూ.6 వేల ఫించన్ అందించాలన్న ప్రభుత్వ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని, రాష్ట్ర ఆర్థి క పరిస్థితుల వల్ల కొంత ఆలస్యమవుతుందని తెలిపారు.
‘ఇందిరమ్మ’లో ప్రాధాన్యం
దివ్యాంగులకు గృహ భద్రత కల్పించేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వారికి ప్రా ధాన్యం కల్పించామని మంత్రి అడ్లూరి స్ప ష్టం చేశారు. తమ ప్రభుత్వం పేదల కోసం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించిం దని, బీఆర్‌ఎస్ హయాంలో ఎన్ని ఇళ్లు ఇచ్చారో కేటీఆర్, హరీశ్‌రావు తమ గెండల మీద చేయివేసుకుని చెప్పాలని మంత్రి సవాల్ విసిరారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి చర్చిస్తున్నామన్నారు.
తమ ప్రభుత్వం అధికారం లోకి రాగానే రేషన్‌కార్డులు మంజూరు చేసి.. సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ ఇస్తున్నామని తెలిపారు.






