calender_icon.png 30 August, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుతో వైద్యుడు మృతి

30-08-2025 02:08:05 PM

కల్వకుర్తి: నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఎన్ రాములు నాయక్ శనివారం గుండెపోటుతో( heart attack) మృతి చెందాడు. రెండు రోజులుగా జ్వరం రావడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన రాములు నాయక్ 18 నెలల నుండి కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. తోటి వైద్యుని ఆకస్మిక మృతి పట్ల ఆసుపత్రి సూపరిండెడ్ డాక్టర్ శివరాం, వైద్య సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. ఆయన  ఆత్మకి శాంతి చేకూర్చాలని  ప్రార్థించారు.