30-08-2025 09:11:21 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు శోభయాత్రను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) తెలిపారు. శనివారం పట్టణంలోని బంగారుపేట చెరువును పరిశీలించి రూట్ మ్యాప్ శోభాయాత్రపై పోలీసులకు సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాజేష్ మీనా పోలీస్ అధికారులు ఉన్నారు.