calender_icon.png 31 August, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవీ విరమణ అనేది ముగింపు కాదు.. కొత్త జీవిత ఆరంభం

30-08-2025 09:10:26 PM

కోదాడ: పదవీ విరమణ అనేది ముగింపు కాదు కొత్త జీవిత ఆరంభం అని సహకార శాఖఅసిస్టెంట్ రిజిస్టర్ పద్మజ, పిఎసిఎస్ ఎర్రవరం ఛైర్మెన్ నలజాల శ్రీనివాసరావులు అన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని యర్రారం పీఏసిఎస్ సీఈఓ హుస్సేన్ పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొనీ మాట్లాడారు. ఎర్రవరం సొసైటీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశాడని కొనియాడారు. ఎవరైనా కచ్చితంగా పదవి విరమణ చేయక తప్పదని వారు అన్నారు. అనంతరం డైరెక్టర్లు, అధికారులు శాలువాలు, బోకేలతో ఘనంగా సన్మానించారు. నూతన సీఈవోగా మౌలాలి బాధ్యతలు స్వీకరిస్తారని తెలియజేశారు.