30-08-2025 09:09:17 PM
వంగవీటి రామారావు
గరిడేపల్లి (విజయక్రాంతి): సమాజ అభివృద్ధిలో ఆర్యవైశ్యులందరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు(District Library Association Chairman Vangaveeti Rama Rao) కోరారు. శనివారం మండల కేంద్రమైన గరిడేపల్లి లో మండల ఆర్యవైశ్య సంఘం, వాసవి, వనిత క్లబ్ ల ఆధ్వర్యంలో చైర్మన్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఆర్యవైశ్య సంఘం, వాసవి, వనిత క్లబ్బుల ఆధ్వర్యంలో ప్రజలకు సేవలు అందించడం ఎంతో అభినందనీయమన్నారు. ఆర్యవైశ్య సోదరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమాజంలో సేవా తత్పురత పెంచేందుకు కృషి చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సమాజ అభివృద్ధికి తమ వంతు బాధ్యతగా ఆర్యవైశ్యులందరూ సంఘటితంగా సేవలు అందించాలని అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు.కార్యక్రమంలో ఆర్యవైశ్య మండల సంఘం అధ్యక్షులు ఓరుగంటి శ్రీనివాస్,వాసవి క్లబ్ అధ్యక్షులు గెల్లి సతీష్ కుమార్,శ్రీరంగం రత్నాకర్,శ్రీరంగం ప్రసాద్,ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ముచ్చర్ల గోపాలకృష్ణ,శంకర్ తదితరులు పాల్గొన్నారు.