అనురాగ్ విద్యార్థినికి డాక్టరేట్ ప్రదానం
ఘట్ కేసర్, మే 22 (విజయక్రాంతి) : అనురాగ్ విశ్వవిద్యాలయం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థిని మల్లికంటి కుసుమశ్రీ ప్రిప్రాసెసింగ్-ఎన్హానస్డ్ డీప్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ మైటోసిస్ డిటెక్షన్ ఇన్ బ్రెస్ట్ హిస్టోపథాలజీ అనే అంశంపై పరిశోధన నిర్వహించి, మార్గదర్శకుడు డాక్టర్ ఎస్. సతీష్ కుమారన్ పర్యవేక్షణలో తన పరిశోధనను పూర్తి చేశారు. ఈపరిశోధనకు సంబంధించిన వైవా వోస్ పరీక్ష 2026 మే 16న నిర్వహించగా ఈపరీక్షకు సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సూరత్ ఈసీఈ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిశోర్ ఉప్లా బాహ్య పరీక్షకుడిగా పాల్గొన్నారు.
అనురాగ్ విశ్వవిద్యాలయ పరీక్షల విభాగ డీన్ ప్రొఫెసర్ ముత్తారెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన ఈవైవా వోస్ పరీక్షలో ఆర్ అండ్ డి డీన్ డాక్టర్ సతీష్ కుమారన్, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ హరికృష్ణ కమతం, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సికిందర్ బాబా, ఇతర విభాగాల అధిపతులు మరియు ప్రొఫెసర్ల సమక్షంలో మల్లికంటి కుసుమశ్రీ తన పరిశోధనను విజయవంతంగా వివరించి సమర్పించారు. పరీక్షకుల కమిటీ సిఫారసుల ఆధారంగా మల్లికంటి కుసుమశ్రీ కి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టా ప్రదానం చేయబడింది.






