23 May, 2026 | 12:50 AM

బేటీ బచావో బేటీ పడావో నినాదంతో దేశవ్యాప్త బైక్ యాత్రకు శ్రీకారం

23-05-2026 12:00 AM

మేడ్చల్ అర్బన్ మే 22 (విజయక్రాంతి): భేటీ బచావో, బేటి పడావో నినాదంతో మేడ్చల్ మున్సిపల్ పట్టడానికి చెందిన యువకుడు దేశవ్యాప్త బైక్ యాత్రకు శ్రీకారం చుట్టారు. మేడ్చల్ పట్టణానికి చెందిన డి విష్ణువర్ధన్ నాగప్ప మోటార్స్ సౌజన్యంతో సుజుకి యాక్సిస్ 125 వాహనంపై యాత్రకు శ్రీకారం చుట్టగా మేడ్చల్ సిఐ ఎ సత్యనారాయణ యువకుడిని శాలువాతో సత్కరించి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ యువకులు దేశ కోసం, బాలికల కోసం, ఇలాంటి యాత్రలు చేసి అవగాహన కల్పించేం దుకు యాత్ర చేయడం అభినందనీయమని చెప్పారు.ఈ నేపథ్యంలో బైక్ యాత్రను మేడ్చల్ నుండి సియాచిన్,సియాచిన్ నుండి కాశ్మీర్,కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నిర్వహిస్తున్నట్లు  బైక్ యాత్ర స్పాన్సర్ విష్ణువర్ధన్ నాగప్ప వెల్లడించారు.భేటీ బచావో,బేటి పడావో యాత్ర 18 రోజులు 7 వేల కిలోమీటర్ ల దూరం మేరకు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ పట్టణానికి చెందిన పలువురు యువకులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు నసింగ్ రావు గౌడ్.వెంకటేష్.రమణారెడ్డి.తదితరులు పాల్గొన్నారు.