వైద్యులు సమయపాలన పాటించాలి
ఆమనగల్లు, ఆగస్టు 13(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా డిసీహెచ్సి డా. అనురాగిణి రెడ్డి గురువారం ఆమనగల్లు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రికార్డులు, హాజరు పట్టిక, ఒపీ , ఐపీ విభాగాలతో పాటు సీజనల్ వ్యాధులు, పాము, కుక్క కాటు వ్యాక్సిన్ల నిల్వలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోగుల కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన సేవలు అందించాలని, వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు.
గర్భిణీలకు మెరుగైన వైద్యం కోసం నూతనంగా గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్ డాక్టర్లను కేటాయించినట్లు తెలిపారు. అనంతరం రూ.17.50 కోట్లతో నిర్మిస్తున్న సిహెచ్సి నూతన భవన పనులను పరిశీలించి, మరో రెండు నెల ల్లో అసంపూర్తి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.






