16 April, 2026 | 3:21 AM

అబార్షన్ కేసుల్లో వైద్యులు అప్రమత్తంగా ఉండాలి

16-04-2026 01:47 AM
  1. గోపాలపేట ఆసుపత్రిని ఆకస్మికత తనిఖీ చేసిన కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన 

గోపాలపేట ఏప్రిల్15 : వనపర్తి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వైద్యులందరూ అబార్షన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. బుధ వారం గోపాలపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా కలెక్టర్ వైద్యులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం కలెక్టర్ పలు విభాగాలను పరిశీలించారుఈ సందర్భంగా కలెక్టర్ ఈడీడీ డెలివరీ రిజిస్టర్లనుపరిశీలించి, ఆసుపత్రి లోజరుగుతున్న ప్రసవాలు మరియు అబార్షన్ ల వివరాలపై విచారణ చేశారు.

అబార్షన్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు సూచించారు.అబార్షన్ ల కారణాలు, అవి ఎక్కడజరుగుతున్నాయి అనే అంశాలపై సమగ్ర నివేదికసమర్పించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో మెరుగైన సేవల కోసం అవసరమైన సదుపాయాలపై ప్రతిపాదనలు ఫైల్ రూపం లోసమర్పించాలని అధికారులకు సూచించారు.

మహిళలకు హెచ్ పీవి వ్యాక్స్పి అవగాహన కల్పించాలని, ప్రభుత్వ ఆసుపత్ర మవ్వాలన్నారు. అనంతరం పోలికేపాడు గ్రామం లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల ను, అనంతరం మండల కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ను కూడా పరిశీలించారు. కలెక్టర్ వెంట  హౌసింగ్ పీడీ విటోభా, సీపీ ఓ హరికృష్ణ, తహసీల్దార్ తిలక్, వైద్య అధికారులు ఇతర అధికారులు తదితరలు ఉన్నారు.