16 April, 2026 | 3:20 AM

బీసీల సమస్యల పరిష్కారానికి పోరాడతాం

16-04-2026 01:48 AM

జాతీయ బీసీ సంఘం రాష్ట్ర కన్వీనర్‌గా మేక లలిత యాదవ్

జవహర్‌నగర్, ఏప్రిల్ 15( విజయక్రాంతి): జవహర్ నగర్ వాసి, మాజీ కార్పొరేటర్  మేక లలిత యాదవ్ ను జాతీయ బీసీ సంఘం  తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా బుధవారం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ లు నియమించారు , ఈ నియామక పత్రాన్ని కార్యాలయంలో వారి చేతుల మీదుగా  మేక లలిత యాదవ్ కు అందించారు.

ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ  రాష్ట్రంలో బీసీల బలోపేతానికి  వారి అభివృద్ధికి , అలాగే బిసి సమస్యల పైన ఎప్పటికప్పుడు  ఉద్యమిస్తూ పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా మేక లలిత యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి బలోపే తానికి కృషి చేస్తానని బీసీల సమస్యలపై తన గలం వినిపిస్తానని తెలిపారు.

రాష్ట్రంలోని బీసీలందరూ ఏకమవ్వాలని తద్వారా బీసీల ఐక్యత ప్రభుత్వానికి తెలిసేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నామీద ఇంత బాధ్యత ఉంచిన జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ లకు రుణపడి ఉంటారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలందరూ ఏకమయ్యే రోజులు వచ్చాయని, బీసీ లందరూ సమిష్టిగా పోరాడి మన హక్కుల్ని సాధించుకుందామన్నారు. జాతీయ బిసి సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా నియమిత మైనందున ఇకపై ప్రజా సమస్యలపై  గొంతుకై ఉద్యమిస్తానన్నారు.