18 June, 2026 | 5:55 AM

దేశవ్యాప్తంగా కోల్ కతా ఘటనపై వైద్యుల నిరసనలు

17-08-2024 11:38 AM

హైదరాబాద్: కోల్ కతా ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. వైద్యురాలిపై జరిగిన హత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యసేవలు నిలిపివేసిన వైద్యులు, 24 గంటలు బంద్ ను ఐఎంఏ ప్రకటించింది. కోల్ కతా, ఢిల్లీ, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి క్లాక్ టవర్ వరకు వైద్యుల నిరసనగా ర్యాలీ కొనసాగిస్తున్నారు.

రేపు ఉదయం 6 వరకు ఈ నిరసనలు కొనసాగనున్నాయని వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రుల్ల అత్యవసర వైద్యం మినహా వైద సేవలను నిలిపివేస్తూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, వైద్య సిబ్బంది కోసం కొత్త చట్టం తేవాలని వైద్య సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. కోల్ కతా ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా వైద్యుల నిరసన కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి క్లాక్ టవర్ వరకు, సుచిత్ర కూడలి నుంచి జీడిమెట్ల గాంధీ విగ్రహం వరకు కొంపల్లి వైద్యబృందం ర్యాలీ నిర్వహిస్తుంది. వైద్యులు, సిబ్బంది నిలోఫర్ ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన తెలుపుతారు.